📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguభక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

 

గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై డీఎస్పీ రవీందర్ పరిశీలన

గౌరారం చెరువు పాయింట్‌ను సందర్శించి అధికారులకు సూచనలు

చల్వాయి( ప్రజావాణి )

గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని చల్వాయి మండలంలోని గౌరారం చెరువును ములుగు డీఎస్పీ రవీందర్ సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
గౌరారం చెరువులో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన పాయింట్‌ను పరిశీలించిన డీఎస్పీ రవీందర్, నిమజ్జన కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.
నిమజ్జన సమయంలో భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రాకపోకలు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ రవీందర్ తెలిపారు. సి ఐ దయాకర్. ఎస్ ఐలు. తాజుద్దీన్. ఆంజనేయులు. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.