భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

  గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై డీఎస్పీ రవీందర్ పరిశీలన గౌరారం చెరువు పాయింట్‌ను సందర్శించి అధికారులకు సూచనలు చల్వాయి( ప్రజావాణి ) గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని చల్వాయి మండలంలోని గౌరారం చెరువును ములుగు డీఎస్పీ రవీందర్ సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. గౌరారం చెరువులో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన పాయింట్‌ను పరిశీలించిన డీఎస్పీ రవీందర్, నిమజ్జన కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. నిమజ్జన సమయంలో భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని,...