భక్తిశ్రద్ధలతో కుడా అపార్ట్‌మెంట్ వినాయక నిమజ్జనం
హనుమకొండ సెప్టెంబర్ 24 (ప్రజావాణి )
హనుమకొండ: గోకుల్ నగర్‌లోని అంబేద్కర్ భవన్ పక్కన ఉన్న కుడా అపార్ట్‌మెంట్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని భక్తుల కోలాహలం, జై గణేశ్ నినాదాల మధ్య హసన్‌పర్తి చెరువులో నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా భక్తులు బై బై గణేశ్ అంటూ స్వామివారికి వీడ్కోలు పలికారు. కార్యక్రమాన్ని కుడా అపార్ట్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఇట్లు: కుడా అపార్ట్‌మెంట్
కమిటీ

