📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetబెజ్జంకి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

బెజ్జంకి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

 

 

బెజ్జంకి, సెప్టెంబర్ 10 (ప్రజావాణి)

 

 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్, ఎస్‌ఐ తోట తిరుపతి హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

 

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం:

 

ఈ సందర్భంగా మండల రజక సంఘం అధ్యక్షులు దీటి రాజు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. భూస్వామ్య, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ రజకుల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దూమల మహేష్, సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, వార్డు సభ్యులు తిప్పారపు మహేష్, లోనే నర్సింగరావు, ముదిరాజు సంఘం నాయకులు కొరివి తిరుపతి, యాదవ సంఘం నాయకులు కల్లూరి అజయ్, బోనగిరి లింగం, మండల రజక సంఘం నాయకులు కూరెల్ల బాలయ్య, గౌరవ అధ్యక్షులు వడ్లూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వేములవాడ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.