📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబీరం లక్ష్మారెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న కొప్పునూరుగ్రామ బి ఆర్...

బీరం లక్ష్మారెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న కొప్పునూరుగ్రామ బి ఆర్ ఎస్ కార్యకర్తలు

📰 Generate e-Paper Clip

బీరం లక్ష్మారెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న

కొప్పునూరుగ్రామ బి ఆర్ ఎస్ కార్యకర్తలు

వడ్డేమాన్ రామకృష్ణ ఆధ్వర్యంలో 60 మంది బిఆర్‌ఎస్‌ కార్యకర్తల హాజరు

చిన్నంబావి ప్రజావాణి సెప్టెంబర్ 27

కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి బీరం లక్ష్మారెడ్డి పెద్దకర్మ కార్యక్రమానికి చిన్నంబావి మండల పరిధిలోని కొప్పునూరు గ్రామం నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్ నాయకులు, వడ్డేమాన్ రామకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. గ్రామానికి చెందిన వడ్డేమాన్ రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 60 మంది బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా బయలుదేరి, పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. “కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలవడమే నిజమైన అనుబంధం” బీరం లక్ష్మారెడ్డి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, వారి దుఃఖంలో భాగస్వాములయరు . కొప్పునూరు గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై తమ అభిమానాన్ని, ఆత్మీయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా వడ్డేమాన్ రామకృష్ణ ఆధ్వర్యంలో తరలివెళ్లిన కార్యకర్తలు బీరం లక్ష్మారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
కొప్పునూరు నుంచి 60 మంది కార్యకర్తలు వాహనలలో తరలివెళ్లడం స్థానికంగా ప్రత్యేకంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.