*బీరంగూడలో వరసిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు!
*రాజు కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు.. భక్తుల కోసం ఉత్సవ కమిటీ ఏర్పాట్లు
బీరంగూడ, సెప్టెంబర్ 16 (ప్రజావాణి):
వినాయక చవితి సందర్భంగా బీరంగూడ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ధి వినాయకుడికి చేర్యాల రాజు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని దర్శించుకుని పూజలు, అభిషేక కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో గణనాథుడి కృప ఉండాలని ప్రార్థించారు.
మరోవైపు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

