బీరంగూడలో వరసిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు
*బీరంగూడలో వరసిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు! *రాజు కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు.. భక్తుల కోసం ఉత్సవ కమిటీ ఏర్పాట్లు బీరంగూడ, సెప్టెంబర్ 16 (ప్రజావాణి): వినాయక చవితి సందర్భంగా బీరంగూడ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ధి వినాయకుడికి చేర్యాల రాజు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని దర్శించుకుని పూజలు, అభిషేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో...