📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఫుడ్ మార్కెట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన పరకాల శాసనసభ్యులు

ఫుడ్ మార్కెట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన పరకాల శాసనసభ్యులు

📰 Generate e-Paper Clip

ఫుడ్ మార్కెట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన పరకాల శాసనసభ్యులు

సెప్టెంబర్ 27.ప్రజావాణి న్యూస్/ గీసుకొండ

గీసుగొండ మండలంలోని విశ్వనాథపురం గ్రామంలో ఫుడ్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి అనుకూలమైన ప్రాంతాన్ని,వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏ. ప్రియాంక అనిల్ లతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.రైతులు,వ్యాపారులు, స్థానిక ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా ఫుడ్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, మార్కెటింగ్ వసతులు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు.ఫుడ్ మార్కెట్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు అందడంతో పాటు, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడం, వ్యాపార కార్యకలాపాలకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో గీసుకొండ మండల పార్టీ అధ్యక్షులు దాడి శివ,తెలంగాణ రాష్ట్ర పిసిసి మహిళ భీమ గాని సౌజన్య,వరంగల్ జనరల్ సెక్రెటరీ తుమ్మనపల్లి శ్రీనివాస్,ఆకుల రుద్ర ప్రసాద్,కుసం రమేష్,దూల వెంకటేశ్వర్లు,హలవత్ వీరన్న,కోమ్మాల సర్పంచ్ యమున ప్రవీణ్,నంద నాయక్ తండ సర్పంచ్ భూక్య అఖిల్,విశ్వనాధపురం సర్పంచ్ జ్యోతి తిరుపతి, అనంతరం సర్పంచ్ సతీష్ అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు,బిఎల్ఎలు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.