📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonకుందారంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ మరియు గౌసే ఆజం సీరత్ కార్యక్రమం

కుందారంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ మరియు గౌసే ఆజం సీరత్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*కుందారంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ మరియు గౌసే ఆజం సీరత్ కార్యక్రమం*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27(ప్రజావాణి):
జిల్లా లోని లింగాల ఘనపూర్ మండలం కుందారం గ్రామంలోని జామియా మసీదులో ఆదివారం జష్నే మిలాద్-ఉన్-నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు సీరతే హజ్రత్ గౌసే ఆజం దస్తగీర్ (రహ్మతుల్లాహి అలైహి) కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ జిల్లా ముస్లిం డెవలప్‌మెంట్ కమిటీ అధ్యక్షులు, న్యాయవాది జమాల్ షరీఫ్ హాజరై ప్రసంగించారు. ప్రవక్త ముహమ్మద్ (స) జీవితం, వారి బోధనలు, హజ్రత్ గౌసే ఆజం జీవిత చరిత్రను ఆయన వివరించారు.

శాంతి, ప్రేమ, సోదరభావం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మౌలానా జానీ సాహెబ్, సామి భాయ్, మసీదు సదర్ ఖలీల్ భాయ్, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.