*ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా గండిమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు*
*ప్రధానమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి బీజేపీ నాయకులు*

మేడ్చల్, సెప్టెంబర్ 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్ పట్టణంలోని గండిమైసమ్మ ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు, దీపారాధన నిర్వహించారు. మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జల్లి శైలజ హరినాథ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశ ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ గండిమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచంలో మరింత బలమైన దేశంగా ఎదగాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషి కొనసాగాలని, దేశం శాంతి, సౌభాగ్యాలతో ముందుకు సాగాలని బీజేపీ నాయకులు ఆకాంక్షించారు. అనంతరం ఆలయంలో దీపారాధన నిర్వహించి మోదీ జన్మదిన వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పాతూరి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కోశాధికారి లవంగ శ్రీకాంత్, మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ ప్రధాన కార్యదర్శి కానుకంటి వంశీ విజయ్ వంజరి, జకట ప్రేమదాసు, ఉపాధ్యక్షులు సర్వేశ్వర రెడ్డి, సీనియర్ నాయకులు చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, డి.వి. మోహన్ రావు, మహిళా నాయకులు జంగం అనిత, శోభారాణి, నాయకులు మహేష్ గౌలికర్, రావల్కోల్ మహేష్, మహీందర్ తదితరులు పాల్గొన్నారు.

