*ప్రత్యేక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలి*
*మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వినతి*
* *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
జిల్లా పేద ప్రజల కోసం నూతనంగా ప్రారంభించబోయే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పూర్తి సౌకర్యాలతో ప్రత్యేక డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త వంజరి వెంకటేష్ కోరారు. డయాలసిస్ రోగుల ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ, మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్ శిథిలావస్థలో ఉండటంతో, ప్రమాదం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. తాత్కాలికంగా పాత మెడికల్ కాలేజీలో షెడ్డు ఇచ్చినా అక్కడ కనీస వసతులు లేవని ఆరోపించారు. రక్త పరీక్షలకు, డాక్టర్ పర్యవేక్షణకు మరల దూరంగా ఉన్న ఆసుపత్రికి కు వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడితే, కనీసం జనరేటర్ సౌకర్యం సైతం లేదన్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను తరలించడం కష్టంగా ఉందని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జనరల్ ఆసుపత్రిలో డయాలసిస్ బ్లాక్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో వెంకటేష్, రావుల లక్ష్మీ బాబు, అడిగోప్పల మురళి, బండి హరీష్, నాగవత్ శేఖర్ నాయక్, రావుల రాంచందర్, రావుల మల్లయ్య లు పాల్గొన్నారు.

