📄 ePaper
Epaper 2
Thursday, September 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పొడి చెత్త ఇవ్వండి.ఇంటి సరుకులు పట్టుకెళ్ళండి: బిన్-బ్యాగ్’ విధానంపై కలసపాడు ఎంపీడీఓ మహబూబ్ బి అవగాహన

పొడి చెత్త ఇవ్వండి.ఇంటి సరుకులు పట్టుకెళ్ళండి: బిన్-బ్యాగ్’ విధానంపై కలసపాడు ఎంపీడీఓ మహబూబ్ బి అవగాహన

📰 Generate e-Paper Clip

కలసపాడు సెప్టెంబర్ 24ప్రజావాణి మండల పరిధిలోని తెల్లపాడు గ్రామపంచాయతీ, దూలంవారిపల్లి గ్రామాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) మహబూబ్ బి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛత భాగమైన ‘బిన్-బ్యాగ్’ విధానంపై ప్రజలకు మరియు సచివాలయ సిబ్బందికి ఆయన ప్రత్యేక అవగాహన కల్పించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని, ఇందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు.పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, వర్మీ కంపోస్ట్ తయారీపై ఎంపీడీఓ చేపట్టిన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి:

చెత్త నుండి సంపద తయారీ కేంద్రం  సందర్శన

పర్యటనలో భాగంగా ఎంపీడీఓ మహబూబ్ బి తొలుత తెల్లపాడు గ్రామపంచాయతీలోని ‘చెత్త నుండి సంపద తయారీ కేంద్రం’ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించి, నాణ్యమైన వర్మీ కంపోస్ట్ (వానపాముల ఎరువు) ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేయాలని తానే స్వయంగా ముندడుగు వేసి,వర్మీ బెడ్ ప్రిపరేషన్‌ను చేయించారు. బెడ్‌ను మొదటి దశ కంపోస్ట్ ఎరువుతో నింపించి, అందులో వానపాములను వదిలారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే అక్టోబర్ నెలలో ప్రతి గ్రామపంచాయతీ కనీసం 1000 కేజీల నాణ్యమైన వర్మీ ఎరువును ఉత్పత్తి చేసేలా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని పంచాయతీ అభివృద్ధి అధికారిని (సచివాలయ ఈఓ) ఆదేశించారు. దీని ద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు.

ఇంటింటికీ వెళ్లి ‘బిన్-బ్యాగ్’ విధానంపై అవగాహన

అనంతరం దూలంవారిపల్లి గ్రామంలో ఎంపీడీఓ మహబూబ్ బి సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగారు. ప్రజలతో నేరుగా ముచ్చటించి, ఇళ్లలో వ్యర్థాలను ఎలా నిర్వహించాలో వివరించారు. ముఖ్యంగా ఇంట్లో ఉత్పత్తయ్యే చెత్తను ఒకేచోట వేయకుండా, నాలుగు రకాలుగా వర్గీకరించాలని సూచించారు.తడి చెత్త,పొడి చెత్త,శానిటరీ వ్యర్థాలు,

ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన ప్రమాదకర వ్యర్థాలు

పొడి చెత్తను ప్రభుత్వం పంపిణీ చేసిన ప్రత్యేక బ్యాగుల్లో భద్రపరచాలని కోరారు.ఆ చెత్తను గ్రామానికి వచ్చే ‘స్వచ్ఛ రథం’ వాహనానికి అప్పగించాలని, ఆ వ్యర్థాల విలువకు సరిపడా నిత్యవసర కుటుంబ సరుకులను పొందేలా వీలు కల్పిస్తున్నామని ప్రజలకు వివరించారు.ఈ విధానం వల్ల ఇటు గ్రామం సుందరంగా మారుతుందని, అటు ప్రజలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.గ్రామాల్లో పారిశుధ్య పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన టెక్నాలజీ విధానాలపై కూడా ఎంపీడీఓ ప్రజలకు అవగాహన కల్పించారు. శానిటేషన్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) కాల్స్ మరియు స్వచ్ఛరథం కాల్స్ ప్రాధాన్యతను వివరించారు.అధికారులు లేదా స్వచ్ఛంద వ్యవస్థల నుండి వచ్చే ఫోన్ కాల్స్‌కు సానుకూలంగా స్పందించి, పారిశుధ్య సేవలపై తమ అభిప్రాయాలను, సమస్యలను పంచుకోవాలని కోరారు.సుందర గ్రామంగా తీర్చిదిద్దేందుకు సహకరించండి ముగింపుగా, గ్రామ ప్రజలందరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీఓ పిలుపునిచ్చారు.ప్లాస్టిక్ రహిత,చెత్త రహిత గ్రామ పంచాయతీలుగా తెల్లపాడు,దూలంవారిపల్లి గ్రామాలను తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పని చేయాలన్నారు.మన గ్రామాన్ని స్వచ్ఛమైన మరియు సుందరమైన గ్రామంగా మార్చుకోవడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సచివాలయ సిబ్బంది,స్వచ్ఛభారత్ పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛ రథం నిర్వాహకులు మరియు గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.