పొడి చెత్త ఇవ్వండి.ఇంటి సరుకులు పట్టుకెళ్ళండి: బిన్-బ్యాగ్’ విధానంపై కలసపాడు ఎంపీడీఓ మహబూబ్ బి అవగాహన

కలసపాడు సెప్టెంబర్ 24ప్రజావాణి మండల పరిధిలోని తెల్లపాడు గ్రామపంచాయతీ, దూలంవారిపల్లి గ్రామాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) మహబూబ్ బి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛత భాగమైన ‘బిన్-బ్యాగ్’ విధానంపై ప్రజలకు మరియు సచివాలయ సిబ్బందికి ఆయన ప్రత్యేక అవగాహన కల్పించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని, ఇందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు.పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, వర్మీ కంపోస్ట్ తయారీపై ఎంపీడీఓ చేపట్టిన పర్యటన వివరాలు ఇలా...