📄 ePaper
Epaper 2
Thursday, September 24, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedakచిలిపిచెడ్ మండల ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

చిలిపిచెడ్ మండల ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

చిలిపిచెడ్ మండల ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం.. శాలువాలు, ప్రశంసా పత్రాలతో సత్కారం

చిలిపిచెడ్, సెప్టెంబర్ 24 ప్రజావాణి

మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి మండల విద్యాధికారి పి. విఠల్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేశారు.

విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు
విష్ణువర్ధన్, సుభాష్, యాదగౌడ, శర్వాన్, మహేష్, అజయ్, శ్రీనివాస్, హిందూరాణి, ఉషారాణి, ఉషాశ్రీ, భవాని, సుజాత, అశ్విని, నవీన్, మదర్, అంజలి తదితర ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. వీరితో పాటు మండలంలోని ఇతర ఉత్తమ ఉపాధ్యాయులను కూడా వారి విద్యా సేవలను గుర్తిస్తూ సన్మానించారు.

కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ రమేష్, ధనమూర్తి, కృష్ణ, నాగరాజు, తారాసింగ్ తదితరులు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమానికి సహకారం అందించిన లింగ గౌడ్‌ను కూడా మండల విద్యాశాఖ తరఫున సన్మానించారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.