పెద్దవంగర మండల పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు
చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన డాక్టర్ కూరపాటి రమేష్. రాధిక
పెద్దవంగర సెప్టెంబర్ 27 ప్రజావాణి. .మండల కేంద్రం లోని అంబేద్కర్ సెంటర్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఇంటిలెక్సవల్ ఫోరమ్ కన్వీనర్ డాక్టర్ కూరపాటి రమేష్. ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ ఇంటిలేక్స్వల్ ఫోరమ్ కోఆర్డినేటర్ డాక్టర్ కూరపాటి రాధిక. మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కి ఘన నివాలులు అర్పించి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను కొని యాడినారు స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమకారుడు గా నీలిచి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా సంఘటితమై బీసీల హక్కులను వినియోగించుకోవాలని బీసీ ఒక్కతాటి పైకి రావాలని బీసీల ఐక్యత వర్ధిల్లాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమం లొ మహబూబాబాద్ జిల్లా బీసీ ఇంటలెక్చవల్ ఫోరం కోఆర్డినేటర్ ఎదునూరి శ్రీనివాస్. మండల పద్మశాలి సంఘ అధ్యక్షులు రాపోలు శ్రీనివాస్. గౌరవ అధ్యక్షులు గుల్లపల్లి సదానందం. పద్మశాలి సంఘం నాయకులు వేముల రాజు. గుడ్ల రమేష్. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుమ్మరి రామ్మూర్తి.వెంకట్ నారాయణ యాదవ్.రాష్ట్ర కోఆర్డినేటర్ కొంగ వీరస్వామి. తదితరులు పాల్గొన్నారు.

