📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగాగిల్లాపూర్ లో (అమ్మకు అక్షర మాల)మహిళలకు అక్షరాస్యత పరీక్ష

గాగిల్లాపూర్ లో (అమ్మకు అక్షర మాల)మహిళలకు అక్షరాస్యత పరీక్ష

📰 Generate e-Paper Clip

గాగిల్లాపూర్ లో (అమ్మకు అక్షర మాల)మహిళలకు అక్షరాస్యత పరీక్ష

మద్దూరు సెప్టెంబర్ 27, ప్రజా వాణి,

మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల వద్ద
అమ్మకు అక్షరమాల – కార్యక్రమం కింద 60 ఏళ్ల మహిళల అక్షరాస్యత పరీక్ష నిర్వహించారు.
కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న (నవ భారత్ సాక్షరతా కార్యక్రమం) – అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా మద్దూర్ మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో 60 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్య మహిళలకు 100 రోజుల పాటు అక్షరాస్యత తరగతులు తో పాటు పరీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమం వల్ల గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, ప్రభుత్వ పథకాలను స్వయంగా అర్థం చేసుకునే స్థాయికి చేరుకుంటున్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఇంకా చదువురాని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని సర్పంచ్ కోరారు.ఈ కార్యక్రమంలో సీఏ ఆంజనేయులు,సీసీ సుమలత, వివో అధ్యక్షురాలు,డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.