పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి.
పెద్దవంగర సెప్టెంబర్ 09 ప్రజావాణి . పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి అని భారతీయ జనతాపార్టీ పెద్దవంగర మండల అధ్యక్షుడు కట్టోజు భాస్కరా చారి ఆధ్వర్యంలో మండల ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేయడం జరిగింది బిజెపి తరుపున తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయునది ఏమనగా! 15 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా 40లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది.రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా విద్యార్థులు గత పన్నెండు ఏళ్ళుగా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అని,ఉన్నత చదువులు మధ్యలోనే ఆపివేసి డ్రాపౌట్స్ గా మిగిలిపోతున్నారని, స్కాలర్షిప్పులు భిక్ష కాదు ప్రభుత్వ బాధ్యత అని గుర్తెరిగి వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని అలాగే భూభారతి 22A కొత్త చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు గౌడ్, జిల్లా కార్యదర్శి సాయిని ఝాన్సీ, మండల ప్రధాన కార్యదర్శి ముఖేష్, మండల కార్యదర్శి సుధాకర్, జిల్లా నాయకులు శంకర్, సందీప్, మండల నాయకులు గణేష్, పుల్లయ్య, బాలు, పవన్ తదితరులు పాల్గొన్నారు.

