*పాలకుర్తిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు*
*త్యాగం, పోరాటం, సేవకు ప్రతీక బాపూజీ – అతిథుల నివాళి*
జనగామ జిల్లా ప్రతినిధి (పాలకుర్తి), సెప్టెంబర్ 27(ప్రజావాణి): తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు పాలకుర్తి మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి.
పాలకుర్తిలోని బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన ప్రాంగణంలో, విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోగు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ ప్రజల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు బాపూజీ అని అన్నారు. మంత్రి పదవిని సైతం త్యాగం చేసి తెలంగాణ కోసం నిలబడిన నిస్వార్థ నాయకుడు ఆయన అని కొనియాడారు.
అనంతరం మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు మాచర్ల సారయ్య, గూడూరు చేనేత సహకార సొసైటీ మాజీ చైర్మన్ రచ్చ కృష్ణమూర్తి, పోపా జిల్లా సహాయ కార్యదర్శి చిదురాల ఎల్లయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి దశ ఉద్యమంలో బాపూజీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. పాలకుర్తిలో విగ్రహ ప్రతిష్టాపన ద్వారా ఆయన త్యాగాలను భవిష్యత్ తరాలకు చాటిచెప్పవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ గౌరవ అధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర పద్మశాలి సంఘ సహాయ కార్యదర్శి పెనుగొండ రమేష్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు చిలుకమారి వెంకటేశ్వర్లు, చిదురాల మార్కండేయ, ప్రధాన కార్యదర్శి చిలకమారి సోమేశ్వర్ (బన్నీ), కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ పులి గణేష్ గౌడ్, నాయకులు కామారపు సునీల్, ఎడవెల్లి సోమమల్లయ్య, అబ్బాస్ అలీ, మాచర్ల పుల్లయ్య, మన్యపు భూజేందర్, యాక సోమయ్య, కాటబత్తిని రమేష్, ఈగ శ్రీనివాస్, చిలుకమారి శ్రీధర్, ఎనగందుల శ్రీనివాస్, పెనుగొండ సోమశేఖర్ తదితర కమిటీ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు, పద్మశాలి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

