📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialపాతగూడూరులో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

పాతగూడూరులో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

📰 Generate e-Paper Clip

జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి సెప్టెంబర్ 04 (ప్రజావాణి):

ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామంలోని మాల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించారు. చిన్నారల ముద్దులొలికే అలంకరణలు, సంప్రదాయ దుస్తులు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల కోలాహలం నడుమ ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ… శ్రీకృష్ణ భగవానుడు మానవాళికి అందించిన భగవద్గీత సందేశం ఎంతో మహోన్నతమైనదని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ధర్మమార్గంలో పయనిస్తూ, సన్మార్గంలో జీవిస్తూ ఆ భగవంతుని కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిమల్ల నవీన్, రెడ్డిమల్ల మల్లేశం, రెడ్డిమల్ల శేఖర్, గంధం నర్సయ్య, గంధం శ్రీధర్, కుదారి మల్లేశం, ముత్తర్ల అంజయ్య, గంధం సాయికిరణ్ తో పాటు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.