📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguపదవీ విరమణ చేసిన ఇద్దరు పోలీసు సిబ్బందికి ఘన వీడ్కోలు

పదవీ విరమణ చేసిన ఇద్దరు పోలీసు సిబ్బందికి ఘన వీడ్కోలు

📰 Generate e-Paper Clip

*పదవీ విరమణ చేసిన ఇద్దరు పోలీసు సిబ్బందికి ఘన వీడ్కోలు*

*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-

ములుగు జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి ఈరోజు పదవీ విరమణ చేసిన శ్రీ వడ్డెబోయిన కాశ సత్యనారాయణ మరియు శ్రీ బోదబోయిన పురుషోత్తంలకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు.శ్రీ వడ్డెబోయిన కాశ సత్యనారాయణ 1990లో ARPCగా పోలీస్ శాఖలో చేరి సుమారు 36 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో సేవలందించారు. వరంగల్‌లో కానిస్టేబుల్‌గా సుమారు 25 సంవత్సరాలు, DTC మడికొండలో ఇన్‌స్ట్రక్టర్‌గా 7 సంవత్సరాలు పనిచేసి పలు బ్యాచ్‌ల సిబ్బందికి శిక్షణ అందించారు. 2015లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2020లో ARSIగా పదోన్నతి పొందారు. బెల్లంపల్లి అనంతరం ములుగు జిల్లాలో సేవలందించారు. ఇటీవల సేవా పతకం అందుకున్నారు.శ్రీ బోదబోయిన పురుషోత్తం 1990 బ్యాచ్‌లో సివిల్ పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి ధర్మసాగర్, వరంగల్, హన్మకొండ, పస్రా, మైబాద్, మట్టెవాడ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. 2012లో హెడ్ కానిస్టేబుల్‌గా, అనంతరం ASIగా పదోన్నతి పొందారు. భూపాలపల్లి, ములుగు, వెంకటాపురం, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో సేవలందించారు. 2021లో సేవా పతకం అందుకున్నారు. 2022 నుంచి వాజేడు–వెంకటాపురం ప్రాంతంలో సేవలందిస్తూ పదవీ విరమణ చేశారు.
ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్ పి కేకన్ సుదీర్ రామనాథ్ ఐపీస్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం అంకితభావంతో విధులు నిర్వహించిన పదవీ విరమణ పొందిన సిబ్బంది సేవలను అభినందించారు. వారి అనుభవం, క్రమశిక్షణ, విధినిబద్ధత పోలీస్ శాఖకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. గత కాలంలో వారి కష్టం కృషి వల్లనే ఈ రోజు పోలీస్ శాఖ అనేక ఒడి దోడుకులను తట్టుకొని ప్రజలకు నాణ్యమైన సేవలను అందించగలిగామణి పదవీ విరమణ అనంతరం వారు కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.జిల్లా పోలీస్ శాఖ తరఫున పదవీ విరమణ పొందిన ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఎస్ పి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ములుగు డిఎస్పీ నలువాల రవీందర్ ములుగు సిఐ దారం సురేష్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ వెంకటాపురం సిఐ ముత్యం రమేష్ రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్లు తిరుపతి, శ్రీకాంత్, వెంకటాపురం ఎస్ఐ తిరుపతి, ఆర్ ఎస్ ఐ నిర్మల మరియు ములుగు జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు క్రాంతి కుమార్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.