📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅనబత్తుల ఐలయ్య మృతదేహానికి గొల్లపల్లి రజనీకాంత్ నివాళులు

అనబత్తుల ఐలయ్య మృతదేహానికి గొల్లపల్లి రజనీకాంత్ నివాళులు

📰 Generate e-Paper Clip

అనబత్తుల ఐలయ్య మృతదేహానికి గొల్లపల్లి రజనీకాంత్ నివాళులు
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్ 30 ప్రజావాణి:
కొరవి మండలం మోదుగులగూడెం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు అనబత్తుల ఉపేందర్ తండ్రి అనబత్తుల ఐలయ్య మృతి చెందడంతో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గొల్లపల్లి రజనీకాంత్ ఆయన పార్థివదేహానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రజనీకాంత్, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంఘీభావాన్ని తెలిపారు. ఐలయ్య మృతి ఆ కుటుంబానికి తీరని లోటని, ఈ విషాద సమయంలో అనబత్తుల ఉపేందర్ కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మోదుగులగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ చింతమళ్ల ప్రవీణ్, అయ్యగారిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ మాధవి నాగన్న, పిల్లిగుండ్ల తండా గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ రమేష్ తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనబత్తుల ఐలయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు ప్రార్థించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.