📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనిర్జాప్ల గ్రామంలో ఘనంగా గణేష్ నిమజ్జనం

నిర్జాప్ల గ్రామంలో ఘనంగా గణేష్ నిమజ్జనం

📰 Generate e-Paper Clip

నిర్జాప్ల గ్రామంలో ఘనంగా గణేష్ నిమజ్జనం

నిర్జాప్ల, సెప్టెంబర్ 22: మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి

నిర్జాప్ల గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్దగోళ్ల బీరప్ప, కళ్లపల్లి రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలుకుతూ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. భక్తుల జైజై నినాదాలు, డప్పు వాయిద్యాల నడుమ శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. అనంతరం గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.