📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కోతులగుట్ట సీ. హెచ్. సీ లో ఖాళీ గా ఉన్న స్పెషలి స్టు వైద్యుల పోస్టులు...

కోతులగుట్ట సీ. హెచ్. సీ లో ఖాళీ గా ఉన్న స్పెషలి స్టు వైద్యుల పోస్టులు భర్తీ చేస్తాం

📰 Generate e-Paper Clip

కోతులగుట్ట సీ. హెచ్. సీ లో ఖాళీ గా ఉన్న స్పెషలి స్టు వైద్యుల పోస్టులు భర్తీ చేస్తాం
డీ సీ హెచ్ ఎస్ :డా. సాంబశివరావు

ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం సెప్టెంబర్ 22.

పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం కోతులగుట్ట సీ. హెచ్. సీ లో ఖాళీ గా ఉన్న స్పెషలి స్టు వైద్యుల పోస్టులను త్వరలో నే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని పోలవరం జిల్లా డీ సీ హెచ్ ఎస్ డా. సాంబశివరావు తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన కోతులగుట్ట ఆసుపత్రి ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా అయన ఆసుపత్రి లో జ్వరాలతో బాధ పడుతున్న పలువురితో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడారు ఆసుపత్రి కి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ వైద్యులు, వైద్య సిబ్బంది ని నియమించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె మహేష్ బాబు, డా. సీ హెచ్ తేజ, డా ప్రజ్వల, హెడ్ నర్స్ బీ బొజ్జి, స్థాఫ్ నర్స్ పి రాజమణి, ఎన్ ఆర్ సీ కౌన్సిలర్ కె రమేష్, రవితేజ, నాచుపల్లి వెంకటేశ్వర్లు, బాలరాజు, అమరావతి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.