📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetనిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగం. పోలీసు విధులకు ఆటంకం..

నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగం. పోలీసు విధులకు ఆటంకం..

📰 Generate e-Paper Clip

నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగం.

పోలీసు విధులకు ఆటంకం..

పెదవీడు గ్రామంలో డీజే సీజ్ చేసిన మఠంపల్లి పోలీసులు.

సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు.

హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు.

హుజూర్నగర్ సెప్టెంబర్ 27 (ప్రజావాణి)

ఉత్సవాల నిర్వహణకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుంది, నిభందనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవు అని హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు తెలిపారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా, ప్రజా ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం, పోలీస్ శాఖ అధిక శబ్దాలు చేసే డిజేలు, చాలాసంచపై పూర్తిగా నిషేధం ఉన్నదని దీనిపై ప్రజలకు డివిజన్ నిర్వహణకు అవగాహన కల్పించి డీజే ఉపయోగించరాదని తెలియజేయడం జరిగిందని అన్నారు.

గణేశ్ నిమజ్జన శోభాయాత్రల్లో డీజేలు, అధిక శబ్ద వ్యవస్థల వినియోగం మరియు బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ, మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ పెద్ద శబ్దాలతో డీజేను వినియోగిస్తూ, బాణసంచా కాల్చుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో మఠంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డీజే వినియోగాన్ని నిలిపివేయాలని, పోలీస్ శాఖ జారీ చేసిన నిబంధనలను పాటించాలని సంబంధిత వారికి సూచించారు. అయితే అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా అధిక శబ్దాలతో డీజేను వినియోగిస్తూ నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడ్డారు.

ఈ ఘటనపై నిబంధనల ఉల్లంఘన, అధిక శబ్దాలతో డీజే వినియోగం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం తదితర అంశాలపై సంబంధిత వ్యక్తులపై మఠంపల్లి పోలీస్ స్టేషన్‌లో బీఎన్‌ఎస్ మరియు సంబంధిత చట్ట నిబంధనల మేరకు కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన డీజే పరికరాలను పోలీసులు సీజ్ చేశారు.

*ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి..*

గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టి ఉత్సవ కమిటీలు, ప్రజలు మరియు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించుకున్నామని పేర్కొన్నారు. ఉత్సవాలు అంటే అందరూ కలిసిమెలిసి, సంతోషంగా జరుపుకోవాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించకూడదు. పోలీస్ శాఖ సూచనలు, ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ గౌరవించి పాటించాలని ఆయన కోరారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా అధిక శబ్దాలు చేయడం, నిషేధిత డీజేలు వినియోగించడం, బాణసంచా కాల్చడం లేదా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.

పరస్పర సహకారంతో ఉత్సవాలను విజయవంతంగా, ప్రశాంతంగా మరియు సంతోషంగా నిర్వహించుకోవాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించే వాతావరణాన్ని సృష్టించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.