📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetతెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ నంగునూరులో పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో ఘనంగా...

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ నంగునూరులో పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

నంగునూరు, సెప్టెంబర్ 27 (ప్రజావాణి):నంగునూరు మండల కేంద్రంలో పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, దాసరి రామలింగం, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పవన్ కుమార్ మాట్లాడుతూ…కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని దేశ సేవ చేసిన ఆయన, తెలంగాణ ప్రాంత అభివృద్ధి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని తెలిపారు. ఆయన జీవితం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.తెలంగాణ సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం, ప్రజా సమస్యలపై ఆయన చూపిన నిబద్ధతను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. పద్మశాలి సమాజం అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని, యువత విద్య, ఉపాధి రంగాల్లో రాణిస్తూ సమాజ అభ్యున్నతికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. బాపూజీ ఆశయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడంతో పాటు సమాజంలో ఐక్యత, పరస్పర సహకారం పెంపొందించుకోవాలని నాయకులు సూచించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సాదుల చంద్రశేఖర్,దాసరి రవి, కారపురి శ్రీనివాస్,బింగి రవీందర్, బొజ్జ మహేష్,ఆనందాస్ విష్ణుమూర్తి, దాసరి మల్లేశం, కారంపూరి రామచంద్రం ఆరగొండ శశి, పోతన వినోద్, దికొండ భాను, దాసరి వినయ్, దాసరి శేఖర్, వేముల ప్రశాంత్,గాజర్ల సిద్దు, దాసరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.