నారాయణఖేడ్:- (M) (ప్రజావాణి)
ఏడీఏగా ప్రవీణ్ చారి బాధ్యతలు
నారాయణఖేడ్ డివిజన్ ఇన్ఛార్జ్ ఏడీఏగా నాగలిగిద్ద ఏవో ప్రవీణ్ చారి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
వ్యవసాయ క్షేత్రం లోని సమస్యల పరిష్కారానికి రైతులకు తన వంతు కృషి చేస్తానని ప్రవీణ్ చారి పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన నూతన్ కుమార్ బదిలీపై వెళ్లడంతో ప్రవీణ్ చారి కి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

