📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliదళిత నాయకుడు బొట్ల స్వామికి ఘన నివాళి ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకుల సంతాపం

దళిత నాయకుడు బొట్ల స్వామికి ఘన నివాళి ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకుల సంతాపం

📰 Generate e-Paper Clip

దళిత నాయకుడు బొట్ల స్వామికి ఘన నివాళి
-ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకుల సంతాపం

రామగుండం,మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబరు 5

ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి బొట్ల స్వామి అకాల మరణం పట్ల సంఘం నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన మృతి చెందారు. శనివారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించిన సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.దాదాపు 30 ఏళ్ల క్రితం ఎలకలపల్లి గేట్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిగా సామాజిక సేవా ప్రస్థానాన్ని ప్రారంభించిన బొట్ల స్వామి, అనంతరం ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎదిగారని నాయకులు గుర్తుచేశారు.దళితుల హక్కులు,సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు.సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్, కవ్వంపల్లి సతీష్,సీనియర్ నాయకులు పానుగంటి రాజలింగం,పుల్లూరి మహేందర్,కాదాసి, కనకయ్య తదితరులు స్వామి భౌతికకాయంపై నీలి జెండా కప్పి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.బొట్ల స్వామి కుటుంబానికి ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని నాయకులు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.