తొగరుపల్లి జడ్పిహెచ్ఎస్ స్కూల్లో నమూనా పార్లమెంట్

తొగరుపల్లి జడ్పిహెచ్ఎస్ స్కూల్లో నమూనా పార్లమెంట్ సంగారెడ్డి, సెప్టెంబర్‌ 29(ప్రజావాణి): సంగారెడ్డి జిల్లా ప్రతినిధి కొండాపూర్‌ మండలంలోని తొగరుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో వినూత్నంగా నమూనా పార్లమెంట్‌ నిర్వహించారు. పార్లమెంట్‌ పనితీరు, ప్రభుత్వ పాలనపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నమూనా పార్లమెంట్‌లో యూసుఫ్‌ బాబా స్పీకర్‌గా, నైనిక ప్రధానమంత్రిగా, మీనాక్షి విద్యాశాఖ మంత్రిగా, మౌనిక ఆర్థిక మంత్రిగా, రిషిత ఆరోగ్యశాఖ మంత్రిగా, సురేష్‌ రవాణాశాఖ మంత్రిగా, గుండప్ప వ్యవసాయశాఖ మంత్రిగా, క్రీస్తురాజు పర్యావరణశాఖ మంత్రిగా వ్యవహరించారు....