*తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి
ఎల్లంపేట మున్సిపల్ బిజెపి పార్టీ అధ్యక్షులు ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్*
*ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని సోమారం వార్డులో జాతీయ జెండా ఆవిష్కరణ*
మేడ్చల్:తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎల్లంపేట్ మున్సిపాలిటీ బిజెపి పార్టీ అధ్యక్షులు ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్ అన్నారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని సోమారం వార్డులో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం చేసి, తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ చరిత్ర, పోరాట స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయవచ్చని పలువురు బిజెపి నాయకులు తెలిపారు. ప్రజలలో జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను మరింత పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపల్ అధ్యక్షులు ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు గౌరవం జగన్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ కంచుగంట మహేష్, సీనియర్ నాయకురాలు పుష్ప మల్లారెడ్డి, సీనియర్ నాయకులు పోచయ్య ముదిరాజ్, సత్యనారాయణ యాదవ్, రాజు నాయక్, వెంకటేష్, లక్ష్మణ్, రవి ముదిరాజ్, శ్రీధర్ రెడ్డి, జీవన్ నాయక్, పద్మారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని జాతీయ జెండాకు గౌరవం సమర్పించి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

