తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ నంగునూరులో పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు
నంగునూరు, సెప్టెంబర్ 27 (ప్రజావాణి):నంగునూరు మండల కేంద్రంలో పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, దాసరి రామలింగం, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పవన్ కుమార్ మాట్లాడుతూ...కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని...