📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalజీడిగడ్డ తండాలో మ్యాజిక్ ఇంకుడు గుంతల సర్వే

జీడిగడ్డ తండాలో మ్యాజిక్ ఇంకుడు గుంతల సర్వే

📰 Generate e-Paper Clip

జీడిగడ్డ తండాలో మ్యాజిక్ ఇంకుడు గుంతల సర్వే

చెన్నారావుపేట సెప్టెంబర్ 29 ప్రజావాణి

మండల కేంద్రంలోని జీడిగడ్డ తండాలో పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, ప్రజాప్రతినిధులతో కలిసి మండల ఎంపీడీవో వెంకటశివానంద్ మంగళవారం మ్యాజిక్ ఇంకుడు గుంతల నిర్మాణానికి అనువైన స్థలాల గుర్తింపు సర్వే నిర్వహించారు. ఇళ్ల నుండి వచ్చే బూడిద నీరు రోడ్లపైకి రాకుండా, భూగర్భ జలమట్టాన్ని పెంచడమే లక్ష్యంగా వీధివీధినా పరిశీలన జరిపారు. వ్యర్థ నీరు ఎక్కువగా నిలిచే ప్రాంతాలను గుర్తించి, ఇంకుడు గుంతల ఏర్పాటుకు స్థలాలను మార్క్ చేశారు. ఈ గుంతల వల్ల దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతతో పాటు తండా ఆరోగ్యకరంగా మారుతుందని అధికారులు తెలిపారు. తండాను స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పంచాయతీ కార్యదర్శి గ్రామస్థులను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.