📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజిల్లా ఉపన్యాస పోటీల్లో మెరిసిన నూతన్ సాయి

జిల్లా ఉపన్యాస పోటీల్లో మెరిసిన నూతన్ సాయి

📰 Generate e-Paper Clip

జిల్లా ఉపన్యాస పోటీల్లో మెరిసిన నూతన్ సాయి..
కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస జ్ఞాపిక అందజేత

ప్రజావాణి,నెల్లికుదురు: జిల్లాస్థాయి ఉపన్యాస పోటీలలో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలానికి చెందిన పీఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా తృతీయ స్థానంలో మెరిశాడు.
కలెక్టర్ స్నేహ శబరిష్ చేతుల మీదుగా శనివారం ప్రశంసా పత్రం,జ్ఞాపికను పొందాడు.
కంబాలపల్లిలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఉపన్యాస పోటీల్లో పీఎం శ్రీ తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల & జూనియర్ కళాశాల, నెల్లికుదురుకు చెందిన విద్యార్థి నూతన్ సాయి గైడ్ టీచర్ ఎఎం అంజుం సుల్తాన్ మార్గదర్శకత్వంలో ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు విద్యార్థి నూతన్ సాయిని, గైడ్ టీచర్ ఎం.ఏ. అంజుమ్ సుల్తానాను అభినందించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థుల తోపాటు మండల ప్రజలు నూతన్ సాయికి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.