📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనస్పూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీల ఆటోను ఢీ కొట్టిన లారీ

నస్పూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీల ఆటోను ఢీ కొట్టిన లారీ

📰 Generate e-Paper Clip

నస్పూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీల ఆటోను ఢీ కొట్టిన లారీ

మంచిర్యాల జిల్లా నస్పూర్ గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

*మన ప్రజావాణి*
మంచిర్యాల సెప్టెంబర్ 28

మంచిర్యాల జిల్లా నస్పూర్ గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పని కోసం వెళ్తున్న కూలీల ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పోన్నారం గుడి పేట గ్రామాలకు చెందిన ఏడుగురు మహిళలు మంచిరాల్లోని షాపింగ్ మాల్ లో పనిచేసేందుకు ఆటోలో బయలుదేరారు నాస్పూర్ గేటు వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా మంచిర్యాల వైపు నుంచి జైపూర్ వైపు వేగంగా వెళుతున్న లారీ ఆటోను బలంగా ఢీ కొట్టింది దీంతో ఆటో నుజ్జు నుజ్జు అయింది ఈ ప్రమాదంలో చింతకుంట్ల లక్ష్మీ (30) సౌందర్య( 25) గాయాలైన అక్కడికక్కడే మృతి చెందారు మిగిలిన ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆంబులెన్స్ లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు సమాచారం అందుకున్న నస్పూర్ ఎస్సై తాసిల్దార్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు ఆస్పత్రి వద్ద చెతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.