జిల్లా ఉపన్యాస పోటీల్లో మెరిసిన నూతన్ సాయి
జిల్లా ఉపన్యాస పోటీల్లో మెరిసిన నూతన్ సాయి.. కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస జ్ఞాపిక అందజేత ప్రజావాణి,నెల్లికుదురు: జిల్లాస్థాయి ఉపన్యాస పోటీలలో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలానికి చెందిన పీఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా తృతీయ స్థానంలో మెరిశాడు. కలెక్టర్ స్నేహ శబరిష్ చేతుల మీదుగా శనివారం ప్రశంసా పత్రం,జ్ఞాపికను పొందాడు. కంబాలపల్లిలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఉపన్యాస పోటీల్లో పీఎం శ్రీ తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల...