📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonజనగామ పట్టణంలో దోమల నివారణకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

జనగామ పట్టణంలో దోమల నివారణకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

📰 Generate e-Paper Clip

*జనగామ పట్టణంలో దోమల నివారణకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు*

*ప్రతి వార్డులో వారానికి ఒకసారి ఫాగింగ్ – ఉదయం యాంటీ లార్వా చర్యలు*

జనగామ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 18 ( ప్రజావాణి)
జనగామ పట్టణంలో దోమల నివారణకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మరియు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి శుక్రవారం ok ప్రకటన లో తెలిపారు.
పట్టణంలోని ప్రతి వార్డులో ప్రతి వారం సాయంత్రం వేళల్లో ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఉదయం వేళల్లో మున్సిపల్ సిబ్బంది ద్వారా యాంటీ లార్వా అప్లికేషన్లు, లార్విసైడ్ మందుల పిచికారీ చేపట్టి దోమల లార్వా అభివృద్ధిని అరికడుతున్నట్లు పేర్కొన్నారు.
దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను నివారించడం, పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం లక్ష్యంగా మున్సిపాలిటీ ప్రత్యేక శ్రద్ధతో నిరంతర పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతోందని కమిషనర్ తెలిపారు.
పట్టణ ప్రజలు తమ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల వృద్ధికి అనుకూలమైన ప్రదేశాలను గుర్తించినప్పుడు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు దోమల నివారణలో జనగామ మున్సిపాలిటీ నిరంతరం కృషి చేస్తుందని చైర్ పర్సన్ మరియు కమిషనర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.