కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా కొండూరు రవీందర్ రావు పునఃబాధ్యతల స్వీకరణ
* ఘనంగా సన్మానం చేసినకేడీసీసీబ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డిల
జమ్మికుంటసెప్టెంబర్ 21 (ప్రజావాణి)
తెలంగాణ హైకోర్టు వెలువరించిన కీలక ఆదేశాల మేరకు కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంక్ (కె డి సి సి బి) చైర్మన్‌గా కొండూరు రవీందర్ రావు తిరిగి బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర సహకార బ్యాంకులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి. ఓ. ఆర్ టి. ఎన్ వో.598ను రద్దు చేస్తూ, గతంలో అమల్లో ఉన్న జి . ఓ . ఆర్ టి. ఎన్ వో.386ను కొనసాగించాలని హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందిఈ న్యాయస్థాన ఆదేశాల నేపథ్యంలో రవీందర్ రావు ఈరోజు అధికారికంగా చైర్మన్ పీఠాన్నిఅధిరోహించారు
.బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయనకు కేడీసీసీబ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డిలతో పాటు వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (సింగిల్ విండో) చైర్మన్లు నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు
