*ఘనంగా కాళోజి నారాయణరావు జయంతి*
*తెలంగాణ భాషా యాసకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చిన మహనీయుడు కాళోజి*
షాద్ నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 09:
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ తెలంగాణ ప్రముఖ కవి, ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా బుధవారం ఘనంగా నిర్వహించారు.షాద్‌నగర్‌లోని తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పినపాక ప్రభాకర్ మాట్లాడుతూ,, తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల జీవన విధానాన్ని తన రచనలు, కవితల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి కాళోజి నారాయణరావు అని కొనియాడారు.తెలంగాణ మాండలికానికి, ప్రజల భాషకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.కాళోజి నారాయణరావు కర్ణాటకలో జన్మించినప్పటికీ తెలంగాణపై అపారమైన మక్కువతో ఈ ప్రాంత ప్రజల సమస్యలపై స్పందిస్తూ,తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషించారని తెలిపారు. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు.అనంతరం వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ,, కాళోజి నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ కవి జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాళోజి కవితలు ప్రజల్లో చైతన్యం నింపాయని, ఉద్యమానికి ఆయన సాహిత్యం ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు,మేకల వెంకటేష్,రవి గౌడ్,సునీల్ రెడ్డి, సిందం విటలయ్య,అద్దెట్ల రాజు, అల్లాడ శేఖర్, కుడుముల మల్లేష్, పినపాక ప్రబాకర్, సునీల్ రెడ్డి,సుదాకర్, అసోసియేషన్ సభ్యులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

