📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyగ్లోబల్ ఎక్ససేలెన్స్ ఐకాన్ అవార్డ్స్ - 2026లో షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు...

గ్లోబల్ ఎక్ససేలెన్స్ ఐకాన్ అవార్డ్స్ – 2026లో షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కి అవార్డుల పంట

📰 Generate e-Paper Clip

*గ్లోబల్ ఎక్ససేలెన్స్ ఐకాన్ అవార్డ్స్ – 2026లో షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కి అవార్డుల పంట*

*మార్షల్ ఆర్ట్స్ గ్లోబల్ ఆర్ట్స్ స్టార్ కిడ్ అవార్డులు న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు కైవసం*

*సినీ కళాకారులతో అవార్డుల అందజేత*
షాద్ నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 06:
తెలంగాణ రాష్టంలో ఆమెచూర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అవార్డ్స్ అసోసియేషన్ అధ్యర్యంలో ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఎక్స్సెలెన్స్ ఐకాన్ అవార్డ్స్ – 2026 హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. కరాటే, కుంగ్ ఫు విద్యలలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన వారిని ఎన్నుకొని ప్రతి సంవత్సరo ఈ అవార్డులు అందజేయడం జరుగుతుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా అవార్డు ఫంక్షన్ సినీ కళాకారుల తో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ అవార్డు కార్యక్రమం లో షాద్ నగర్ పట్టణానికి చెందిన న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కి చెందిన విద్యార్థులు అవార్డులు కైవసం చేసుకొని తమ సత్తా చాటారు. ఇందులో కుంగ్ ఫు విద్యార్థులు నాజ్మా బేగం,ఇషిక రెడ్డి, సునైనా బేగం,వేదదిత్య, నాగ,కావలి దిక్షిత,దాన్షిక, వాన్షిక,రక్షిత్, చరణ్ తేజ్,కమల్ దత్, సాత్విక్, దినేష్ తదితరులు తమ నైపుణ్యం కనబర్చిన సందర్బంగా గ్లోబల్ స్టార్ కిడ్స్ ఐకాన్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. వీరికి సినీ కళాకారులైన శివం శివరాత్రి, గబ్బర్ సింగ్ సాయిబాబా, దువ్వూరి సంజయ్, సుహాని నాథ్ చైల్డ్ ఆర్టిస్ట్, మాస్టర్ కేశవ్ గౌడ్, అమర్ సింగ్, సం సాయి చేతులమీదుగా అవార్డులు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.