నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పోలీసులు వారి ఆధ్వర్యంలో మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. రాము ప్రకారం గట్టుప్పల్ సబ్ ఇన్స్పెక్టర్ సంపత్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులకు పలు సూచనలు, నిబంధనలు తెలియజేసారు.
*ఎస్ఐ ఇచ్చిన సూచనలు:*
– ప్రతి వినాయక మండపానికి తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాలి.
– డీజేలు, అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టమ్స్ వాడకూడదు – ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
– విద్యుత్ భద్రత పాటించాలి, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు ఇవ్వకూడదు.
– నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు పాటించాలి.
– శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉత్సవాలు జరుపుకోవాలి.
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల వినాయక మండప నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.

