గణనాథుని దర్శించుకున్న ఎమ్మెల్సీ దండే విఠల్
గణనాథుని దర్శించుకున్న ఎమ్మెల్సీ దండే విఠల్ కొమ్మురం బీం ఆసిఫాబాద్ జిల్లా దాహేగాం: మండలంలోని బిబ్రా గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొలువుదీరిన గణనాథుడిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి గ్రామ ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ దండే విఠల్ ని ఘనంగా సన్మానించి, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దహేగం మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు...