📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyకేశంపేట మండలం సంతాపూర్ గ్రామంలో ఘనంగా పానకాల లక్ష్మీ నరసింహస్వామి జాతర

కేశంపేట మండలం సంతాపూర్ గ్రామంలో ఘనంగా పానకాల లక్ష్మీ నరసింహస్వామి జాతర

📰 Generate e-Paper Clip

*కేశంపేట మండలం సంతాపూర్ గ్రామంలో ఘనంగా పానకాల లక్ష్మీ నరసింహస్వామి జాతర*

*ప్రకృతి రమణీయతకు ప్రతీకగా సంతాపూర్ పానకాల లక్ష్మీ నరసింహస్వామి జాతర*

*మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి*
షాద్ నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 05:
నియోజకవర్గం లోని
కేశంపేట మండలం సంతాపూర్ గ్రామంలోని కొండపై, ప్రకృతి రమణీయమైన అటవీ ప్రాంతం మధ్య కొలువై ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నేడు జాతర, ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటవీ అందాల మధ్య కొండపై వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా కేశంపేట మాజీ జడ్పీటీసీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బార్కం యాదయ్య పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని  స్వీకరించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేశారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.