*కీసర పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి హై డ్రామా*
*కీసర పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు*
*రూ.8.35 లక్షల లంచం వ్యవహారం.. ఎస్సై, సీఐ అదుపులో*
మేడ్చల్ జిల్లా: కీసర పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం వ్యవహారంలో ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాధితుడి నుంచి స్టేషన్ బెయిల్ కోసం భారీగా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందినట్లు తెలిసింది. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని, కీసర చెరువు వద్ద విధుల్లో ఉన్న ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి కారులో రూ.5 లక్షలు తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం కీసర పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లంచం సొమ్ముకు సంబంధించి రసాయన పరీక్షలు నిర్వహించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులును కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
