కాలువలో పడి వ్యక్తి ప్రమాదశాత్తు మృతి
చెన్నారావుపేట సెప్టెంబర్ 25 ప్రజావాణి
మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గుడెల్లి రాజు (44) ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందిన సంఘటన బుదవారం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గుడెల్లి రాజుకి వివాహం కాలేదు మేస్త్రి పని చేసుకుంటూ ఇదే గ్రామంలోని అతని అక్క సగారపు స్వరూపతో కలిసి ఉంటున్నాడు. సెప్టెంబర్ 23న గ్రామంలో జరిగిన అతని బావ సగారపు ఏకాంబరం దశదిశ కర్మ కార్యక్రమానికి హాజరై పాల్గొని రాజు, రాత్రి 9:30 గంటల సమయంలో బయటకు వెళ్లాడు.
రాత్రి వేళ తీవ్రంగా వర్షం కురవడం, రాత్రి సమయం కావడంతో రహదారి కనిపించక పక్కన ఉన్న మురుగు కాలువ కనిపించక అందులో కాలుజారి పడిపోయాడు.కాలువలోని నీటిలో ఊపిరిరాడక, రాత్రంతా వర్షంలో నానడంతో రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరుసటి రోజు (సెప్టెంబర్ 24న) ఉదయం 11:00 గంటలకు గ్రామస్థులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తమ్ముడు గుడేపాటి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ రెడ్డి తెలిపారు
