📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కలసపాడులో ఘనంగా అంగన్‌వాడీ సేవా ఉత్సవాలు

కలసపాడులో ఘనంగా అంగన్‌వాడీ సేవా ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

కలసపాడు:సెప్టెంబర్ 28 ప్రజావాణి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కలసపాడు మండలంలో అంగన్‌వాడీ సేవా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్ హరిప్రియ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి, నంద్యాల జిల్లా ఇన్‌చార్జ్ బొమ్మన విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ హరిప్రియ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృ వందన యోజన, పోషణ్ అభియాన్ వంటి కార్యక్రమాలు వికసిత్ భారత్–2047 నిర్మాణానికి పునాదులుగా నిలుస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా చిన్నారుల మానసిక వికాసం, శారీరక ఎదుగుదల, ఆరోగ్యం, విద్యకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, ముఖ్యంగా పేద కుటుంబాలకు ఇవి ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు.ముఖ్య అతిథి బొమ్మన విజయ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను అభినందించారు. తల్లులు, చిన్నారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నారోజు రమణ చారి, అంగన్‌వాడీ సమన్వయకర్త మనోహర్ రెడ్డి, పోరుమామిళ్ల బీజేపీ అధ్యక్షుడు నాగేంద్ర, కాశినాయన మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, అసెంబ్లీ కో-కన్వీనర్ పల్లంసెట్టి పండారి, శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, తమ్మిశెట్టి రమణ, కలసపాడు మండల కన్వీనర్ రమణరెడ్డి, రామస్వామి, సిద్ధారెడ్డి, కందుకూరి చన్నయ్య తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.అలాగే కలసపాడు మండల సొసైటీ బ్యాంక్ చైర్మన్ కల్లూరి దుగ్గిరెడ్డి కార్యక్రమంలో పాల్గొని అంగన్‌వాడీ సిబ్బందికి సంబంధించిన సమస్యలు ఏవైనా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మి, సూపర్‌వైజర్లు మాధవి, రత్నకుమారి, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, తల్లులకు సేవలు అందిస్తున్న టీచర్లు, ఆయాలను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అంగన్‌వాడీ సూపర్‌వైజర్ హరిప్రియకు పోరుమామిళ్ల బీజేపీ అధ్యక్షుడు నాగేంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి హాజరై సహకరించిన కల్లూరి దుగ్గిరెడ్డికి కూడా బీజేపీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.