📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetఒకే రాత్రి మూడు ఇళ్లలో చోరీ* *బద్దిపడగలో భయాందోళనలు* ...

ఒకే రాత్రి మూడు ఇళ్లలో చోరీ* *బద్దిపడగలో భయాందోళనలు* *తాళాలు పగులగొట్టి నగదు, ఆభరణాల కోసం దుండగుల గాలింపు* *రాత్రి వేళ పోలీసు గస్తీ పెంచాలని గ్రామస్థుల విజ్ఞప్తి*

📰 Generate e-Paper Clip

నంగునూరు, సెప్టెంబర్ 27: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో ఒకే రాత్రి మూడు ఇళ్లలో చోరీలు జరగడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు మూడు వేర్వేరు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.

 

గ్రామానికి చెందిన తాటిపాముల జనార్దన్‌గౌడ్, ఒరిగంటి గణేశ్ రెడ్డి, సందబోయిన ఆయిలేశ్ ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఇళ్ల తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు, ఇళ్లలోని వస్తువులను చిందరవందర చేసి నగదు, విలువైన వస్తువులు, ఆభరణాల కోసం వెతికినట్లు బాధితులు తెలిపారు. మూడు ఇళ్లలో రూ.అయిదు వేల నగదు, ఇరవై తులాల వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. బాధితులు తమ ఇళ్లలోని వస్తువులను పరిశీలించిన అనంతరం చోరీకి గురైన ఆస్తుల వివరాలను పోలీసులకు వెల్లడించారు. చోరీ సమాచారం అందుకున్న రాజగోపాల పేట పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని ఘటనా స్థలాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగల ఆచూకీ కోసం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకే రాత్రి ఒకే గ్రామంలో మూడు ఇళ్లలో చోరీలు జరగడంతో బద్దిపడగ గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. గతంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాత్రివేళల్లో పోలీసు గస్తీని పెంచాలని గ్రామస్థులు పోలీసులను కోరుతున్నారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్థానికులు సూచిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి చోరీలకు పాల్పడిన దుండగులను త్వరగా పట్టుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.