ఒకే రాత్రి మూడు ఇళ్లలో చోరీ* *బద్దిపడగలో భయాందోళనలు* *తాళాలు పగులగొట్టి నగదు, ఆభరణాల కోసం దుండగుల గాలింపు* *రాత్రి వేళ పోలీసు గస్తీ పెంచాలని గ్రామస్థుల విజ్ఞప్తి*

నంగునూరు, సెప్టెంబర్ 27: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో ఒకే రాత్రి మూడు ఇళ్లలో చోరీలు జరగడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు మూడు వేర్వేరు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.   గ్రామానికి చెందిన తాటిపాముల జనార్దన్‌గౌడ్, ఒరిగంటి గణేశ్ రెడ్డి, సందబోయిన ఆయిలేశ్ ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఇళ్ల తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు,...