ఎన్టీఆర్ స్టడీ సర్కిల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్
అనంతపురం బ్యూరో సెప్టెంబర్ 02 మన ప్రజా వాణి
అనంతపురం నగరంలోని మహిళా , బాలల గ్రంథాలయ ప్రాంగణంలో ఉన్న ఆడిటోరియంను నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా ‘ఎన్టీఆర్ స్టడీ సెంటర్ గా మార్చేందుకు అనంతపురం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ గా
నిర్ణయించడం జరిగింది.
అందులో భాగంగా ఇటీవల జిల్లా గ్రంధాలయ సంస్థ నిధులను 5 లక్షల రూపాయలు జిల్లా కలెక్టర్ ద్వారా 35 లక్షల రూపాయాలు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నిర్మాణ పనులకు సంబంధించి బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ (ఉమ్మడి అనంతపురం జిల్లా) చైర్మన్ వడ్డే వెంకట్ ఘనంగా భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్మన్ వడ్డే వెంకట్ మాట్లాడుతూ… పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు, నిరుద్యోగ యువతీ యువకులకు ఈ ఎన్టీఆర్ స్టడీ సెంటర్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం , స్టడీ సెంటర్ అవసరాల నిమిత్తం తాగునీటి ఎద్దడి కలగకుండా వెంటనే బోరు వేయించాలని అధికారులను ఆదేశించారు. నేడు బోరు వేయుటకు పూజ ను నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ సెక్రటరీ శివప్రసాద్, డిప్యూటీ లైబ్రేరియన్ కమ్మన్న, సీనియర్ అసిస్టెంట్ రాజు, కే. మహేష్, లైబ్రేరియన్లు గోవింద్, శ్రీపతి తదితరులు పాల్గొన్నారు.


