ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం -ఉపాధ్యాయుడి చేతిలో పుస్తకం మాత్రమే కాదు - ఒక తరం భవిష్యత్తు ఉంటుంది, -ఎంఈఓ బుధారపు శ్రీనివాస్,   పెద్దవంగర, సెప్టెంబర్ 09 ప్రజావాణి   ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దవంగర మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి, మండల విద్యాశాఖ అధికారి బుదారపు శ్రీనివాస్ సభాధ్యక్షత జరిగిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...