బెజ్జంకి, ఆగష్టు 10(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా సోమవారం మానకొండూరు మాజీ శాసనసభ్యులు(ఎమ్మెల్యే)డా. రసమయి బాలకిషన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మృతురాలి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షులు పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, ఎలా శేఖర్ బాబు, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.

