📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetసర్కారు బడికి సరికొత్త స్ఫూర్తి మత్తె వెంకట్

సర్కారు బడికి సరికొత్త స్ఫూర్తి మత్తె వెంకట్

📰 Generate e-Paper Clip

*సర్కారి బడికి సరికొత్త స్ఫూర్తి మత్తె వెంకట్*

*సరైన గణిత ఉపాధ్యాయుడు దొరకడంతో గణితం లో దూసుకు పోతున్న విద్యార్థులు

*ఉపాధ్యాయునికి గ్రామస్తుల ఆశీర్వాద అభినందన.

అశ్వారావుపేట,ప్రజావాణి న్యూస్ ఆగష్టు 05:
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలు… వినూత్న బోధనతో విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంచుతున్న మత్తె వెంకట్
తిరుమలకుంట గ్రామంలోని ఎంపీయూపీఎస్ (MPUPS) ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న మత్తె వెంకట్ తన సేవా తపనతో గ్రామస్తులు మరియు తన తోటి సహచర ఉపాధ్యాయ బృందాలు మరియు అధికారుల మన్నలను పొందడంలో సఫలీకృతమయ్యారు మత్తె వెంకట్. విద్యను అభ్యసించిన ప్రభుత్వ పాఠశాలలో సేవ చెయ్యాలి అనే ఉదేశ్యం తో ఉద్యోగం సంపాదించి, నేటి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుండటం గ్రామస్థులకు గర్వకారణంగా మారింది.విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా, ముఖ్యంగా గణితాన్ని వినూత్న పద్ధతుల్లో బోధిస్తూ, క్లిష్టమైన అంశాలను సైతం సులభంగా అర్థమయ్యేలా వివరిస్తున్నారు. పెద్ద పెద్ద సంఖ్యలతో లెక్కలు చేయించడం, గణిత ప్రయోగాల ద్వారా పిల్లల్లో ఆలోచనా శక్తిని, తార్కికతను పెంపొందించడం, గణితంపై భయం తొలగించి ఆసక్తిని కలిగించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.ఆయన బోధన విధానంతో విద్యార్థులు గణితంలో మంచి ప్రతిభ కనబరుస్తుండటమే కాకుండా, తిరుమలకుంట పాఠశాలపై గ్రామ ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగింది. దీనివల్ల ఈ విద్యా సంవత్సరంలో తిరుమలకుంట ఎంపీయూపీఎస్ పాఠశాలలో అడ్మిషన్లు గణనీయంగా పెరగడం విశేషం. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడంలో మత్తె వెంకట్ పాత్ర ఎంతో కీలకమని గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. తిరుమలకుంట  పాఠశాల ప్రధానోపాధ్యాయుల తో పాటు ఉపాధ్యాయ బృందం కూడా వెంకట్ కృషిని కొనియాడుతూ, ఆయన వంటి అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యాభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నామని, అడ్మిషన్లు పెరగడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.తన చదివిన ప్రభుత్వ పాఠశాలల్లో ఈసారి విద్యార్థిగా కాకుండా ఉపాధ్యాయుడుగా తిరిగి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలల గుర్తింపు కొరకు కృషి చేస్తూ, గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో జ్ఞానజ్యోతి వెలిగిస్తున్న మత్తె వెంకట్ సేవలు నిజంగా అభినందనీయం. ఆయన అంకితభావం, వినూత్న బోధన, విద్యార్థుల పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలు ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తూ, విద్యార్థుల భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా తీర్చిదిద్దుతున్నాయి. ఈ విషయంపై న్యూస్ డే ఉపాధ్యాయులు మత్తే వెంకట్ సంప్రదించగా ఈ విజయం తిరుమలకుంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం, గ్రామస్తుల వల్లే సాధ్యమైందని సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.